![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 లో మరో ఎలిమినేషన్ కి రంగం సిద్ధమైంది. అయితే పదమూడో వారం ఎలిమినేషన్ లో ఓ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కి అన్యాయం జరుగనుంది. ఇది ఆడియన్స్ కి బిగ్ ట్విస్ట్.. అదేంటంటే ఈ వారం లీస్ట్ లో ఉన్న సంజన, సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వడం లేదు.. వీరిద్దరి కన్నా స్ట్రాంగ్ ఉన్న కంటెస్టెంట్ రీతూ చౌదరి(Rithu Chowdary) ఎలిమినేట్ అవబోతుంది.
కథలో ట్విస్ట్ ఎలాగో ఎలిమినేషన్ లో బిగ్ బాస్ ట్విస్ట్ అలా ఉంది. అదేంటంటే ఈ వారం హౌస్ లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్లో ఉన్నారు. వారిలో తనూజ టాప్ లో ఉంది. భరణి, డీమాన్ పవన్, రీతూలకి స్ట్రాంగ్ ఓటింగ్ ఉంది. అయితే సోషల్ మీడియా లెక్కల ప్రకారం.. సుమన్ శెట్టి, సంజన లీస్ట్ లో ఉన్నారు. వారిద్దరికి అసలు ఓటింగ్ లేదు. కానీ వారిద్దరిని పక్కన పెట్టి రీతూని ఎలిమినేషన్ చేసిన్నట్టుగా బయట ప్రచారం సాగుతోంది.
గత వారమే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినటువంటి దివ్యని ఎలిమినేషన్ చేసినప్పుడే బిగ్ బాస్ బయాస్డ్ అని ట్రోల్స్ చేశారు. ఇక ఇప్పుడు లీస్ట్ లో ఉన్న కంటెస్టెంట్స్ అయినటువంటి సంజన, సుమన్ శెట్టిని ఎలిమినేషన్ చేయకుండా రీతూ చౌదరిని ఎలిమినేషన్ చేయడం అన్ ఫెయిర్ అంటున్నారు నెటిజన్లు.
హౌస్ లో పదమూడు వారాలుగా సుమన్ శెట్టి, సంజన ఆడిందేమీ లేదు.. అలాగని ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిందేమీ లేదు.. అయినా వాళ్ళు హౌస్ లో ఉంటున్నారంటే బిగ్ బాస్ సపోర్ట్ వల్లే. దీనివల్ల హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కి అన్యాయం జరుగుతోందని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
మరి రీతూ ఎలిమినేషన్ అనేది ఫెయిర్ ఆర్ అన్ ఫెయిర్ కామెంట్ చేయండి.
![]() |
![]() |